Saturday, December 21, 2024

సజీవ దహనం కేసులో ట్విస్ట్.. రూ.7కోట్ల ఇన్సూరెన్స్ కోసం ధర్మానాయక్ పన్నాగం

- Advertisement -
- Advertisement -

తెలంగాణ సెక్రటేరియట్‌లో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ధర్మ నాయక్ చనిపోలేదని పోలీసులు తేల్చి చెప్పారు. ఈ నెల 9న పోలీసులకు మెదక్‌ జిల్లా తెక్మల్ మండలం వెంకటాపురం గ్రామ శివారులో తగలబడిన కారు, అందులో కాలిన శవం స్థానికులకు కనిపించింది. పోలీసులు దర్యాప్తు చేసి కారును బట్టీ ఆ వ్యక్తి ధర్మ నాయక్ అని గుర్తించారు. పోస్ట్ మార్టం తర్వాత మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. కుటుంబ సభ్యులు అంత్యక్రియలు కూడా పూర్తి చేశారు. బెట్టింగ్, వ్యసనాలకు అలవాటైన ధర్మానాయక్ 2 కోట్ల అప్పు చేశాడు. ఇన్సూరెన్స్ డబ్బులు వస్తే ఆ అప్పులు తీర్చొచ్చని తాను చనిపోయినట్టుగా చిత్రీకరించాడు.

హైదరాబాద్‌లో ఫ్యామిలీతో ఉంటున్న ధర్మ నాయక్… జనవరి 5న సొంతూరైన మెదక్ వెళ్లాడు. ఆ క్రమంలో ఈ కారు అక్కడ కనిపించింది. కారుకు దగ్గర్లో ఓ ఖాళీ పెట్రోల్ డబ్బాను పోలీసులు గుర్తించారు దాంతో సవాల్ గా తీసుకున్న పోలీసులు ధర్మ నాయక్‌ని ఎవరు చంపి ఉంటారు అనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తుండగా… ఇన్సూరెన్స్ వారు.. అతని పేరుపై రూ.7 కోట్ల ఇన్సూరెన్స్ ఉందని తెలిపారు. ఈమధ్యనే ఇన్సూరెన్స్ కోసం అప్లై చేసినట్లు తెలిపారు. దాంతో పోలీసులకు డౌట్ వచ్చి ధర్మ నాయక్ ఫోన్‌ని ట్రాక్ చేయగా అతను తన భార్యకు కాల్ చేసినట్లు తెలిసింది. తన పేరున ఇన్సూరెన్స్ ఉందనీ, అది క్లెయిమ్ చేసుకోవాలంటే డెత్ సర్టిఫికెట్ ఉండాలని భార్యకు చెప్పినట్లు తెలిసింది. ధర్మ పూణెలో ఉన్నట్లు తెలుసుకున్న పోలీసులు ధర్మాను పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News