Friday, December 27, 2024

కేంద్ర నిధులతోనే మెడికల్ కళాశాల నిర్మాణం : అర్వింద్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్రంలో కొత్తగా ప్రారంభించిన తొమ్మిది మెడికల్ కాలేజీల్లో రాష్ట్ర సర్కారుది నయాపైసా లేదని బిజెపి ఎంపి ధర్మపురి అర్వింద్ అన్నారు. శుక్రవారం బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మెడికల్ కళా శాలల నిర్మాణం కోసం కేంద్రం నుంచి పూర్తి సహాయం అందిందన్నారు. ఇంకా పనులు. సౌకర్యాలు పూర్తి చేయకముందే ప్రారంభించారని మండిపడ్డారు. ఎన్నికలు వస్తున్నాయనే అదరాబాదరాగా ముఖ్యమంత్రి ప్రారంభించారన్నారు. కేంద్రం ఇచ్చిన నిధులతో తొమ్మిది మెడికల్ కళాశాలలు ప్రారంభించారని చెప్పారు.

దేశవ్యాప్తంగా ప్రధాని మోడీ తీసుకున్న విధానంతోనే వైద్యుల సంఖ్య రెండింతలు పెరిగిందని చెప్పారు. తెలంగాణలో జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని.. రాష్ట్రాన్ని బిచ్చ మెత్తుకునేలా బిఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిందన్నారు. ప్రస్తుతం ఉన్న కళాశాలల్లో ప్రొఫెసర్లు, సిబ్బందిపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దవాఖానల్లో మౌలిక సదుపా-యాలు లేవని, రోగులను ఎలుకలు కొరుకుతు న్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కళాశాలకు రూ. 233 కోట్ల 20 లక్షలు నిధులను కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News