Monday, December 23, 2024

సిఎం రేవంత్ రెడ్డి ఆ మాట చెప్పడం సిగ్గుచేటు: అర్వింద్

- Advertisement -
- Advertisement -

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బిజెపి ఎంపి అభ్యర్థి ధర్మపురి అర్వింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఎంపి అభ్యర్థి జీవన్ రెడ్డికి ఇన్నాళ్లు గల్ఫ్ కార్మికులు గుర్తు రాలేదా? అని ధర్మపురి అర్వింద్ ప్రశ్నించారు. నిజామాబాద్ బిజెపి కార్యాలయంలో ఆదివారం అర్వింద్ మీడియా సమావేశం నిర్వహించారు. ఎన్నికలు ఉన్నాయని గల్ఫ్ బోర్డు మాట ఎత్తుకున్నారు? అన్నారు. గల్ఫ్ బోర్డు అంశం కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళికలో ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. గల్ఫ్ కార్మికుల పట్ల కాంగ్రెస్ చిల్లర రాజకీయాలు చేస్తోందని అర్వింద్ మండిపడ్డారు. ఏడాది దోపిడీ ఆపితే రుణమాఫీ సాధ్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం సిగ్గు చేటు అని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News