Monday, January 20, 2025

పోలింగ్ సిబ్బందిపై అర్వింద్ ఆగ్రహం..

- Advertisement -
- Advertisement -

నిజామాబాద్: రాష్ట్రంలో లోక్ సభకు ఎన్నికలు సందర్భంగా ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ బూత్ లకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈక్రమంలో కొద్దిసేపటిక్రితం నిజామాబాద్ బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ మైనారిటీ ఏరియాలోని పోలింగ్ బూత్ లను సందర్శించారు.

మైనార్టీ మహిళ ఓటర్లను ఎలా గుర్తిస్తున్నారని అధికారులను నిలదీశారు. హిజాబ్, మాస్క్ లుంటే నిజమైన ఓటర్లని ఎలా గుర్తిస్తున్నారని ఎలక్షన్ సిబ్బందిని ప్రశ్నించారు. పోలింగ్ బూత్ ల బయట జనం గుంపులు ఉంటే పోలీసులు ఏం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు కాంగ్రెస్ పార్టీకి చెంచాగిరి చేస్తున్నారని ధర్మపురి అరవింద్ మండిపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News