Sunday, December 22, 2024

ముగిసిన డీఎస్ అంత్యక్రియలు

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, పీసీసీ మాజీ చీఫ్నే ధర్మపురి శ్రీనివాస్(డీఎస్) అంత్యక్రియలు ముగిశాయి. నిజామాబాద్ పట్టణంలోని స్మశాన వాటికలో ఆదివారం ఆయన అంత్యక్రియలను పూర్తి చేశారు. డీఎస్ పెద్ద కుమారుడు ధర్మపురి సంజయ్ అంతిమ సంస్కారాలు నిర్వహించారు. అంతకుముందు నివాసం నుంచి డిఎస్ అంతియాత్ర నిర్వహించారు. ఈ అంతియాత్రలో కుటుంబ సభ్యులు, బంధువులతోపాటు అభిమానులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కన్నీటి వీడ్కోలు పలికారు.

అంతిమయాత్రకు ముందు సిఎం రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు డిఎస్ నివాసానికి చేరుకుని ఆయన పార్థివ దేహానికి నివాళుర్పించారు.  కాగా, నిన్న గండెపోటుతో హైదరాబాద్ లోని నివాసంలో డీఎస్ కన్నుమూశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News