Sunday, December 22, 2024

ధర్మపురి స్ట్రాంగ్ రూమ్ ఓపెన్…. అసలు ఏం జరిగింది…

- Advertisement -
- Advertisement -

జగిత్యాల: ధర్మపురి స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేశారు. అధికారులు స్ట్రాంగ్ రూమ్ తాళాలను పగులగొట్టారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో అవకతవకలు జరిగినట్లు కాంగ్రెస్ నేత లక్ష్మణ్ కోర్టును ఆశ్రయించారు. స్ట్రాంగ్‌రూమ్ తాళం మిస్సవడంతో పగులగొట్టాలని కోర్టు ఆదేశించింది. రాజకీయ పార్టీల సమక్షంలోనే తాళాలను అధికారులు పగులగొట్టారు. కౌంటింగ్ కేంద్రం ఫుటేజ్‌ను అధికారులు కోర్టుకు సమర్పించనున్నారు. 17ఎ, 17సి ట్రంక్ బాక్స్‌లకు కూడా తాళాలు లేవని కాంగ్రెస్ నేత లక్ష్మణ్ తెలిపారు. డాక్యుమెంట్లు భద్రపరిచిన వాటికి కూడా తాళాలు వేయలేదని, 14వ రౌండ్ డేటాను కోర్టు ముందు పెట్టాలని నిలదీశారు. ఇంత జరుగుతున్న బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ కొప్పుల ఈశ్వర్ ఎందుకు నోరు మెదపడంలేదని లక్ష్మణ్ ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News