Wednesday, January 22, 2025

జాతరలో పరిటాల శ్రీరామ్….. పిలిచిన వ్యక్తిపై కర్రలతో దాడి

- Advertisement -
- Advertisement -

 

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ధర్మవరంలో రాజకీయ కక్షలు జడలు విప్పాయి. పరిటాల శ్రీరామ్‌ను జాతరకు పిలిచిన వ్యక్తిపై దాడి చేశారు. సమరసింహారెడ్డి అనే జవాన్ తుమ్మలలో జాతరకు టిడిపి నేత, పరిటాల రవి తనయుడు శ్రీరామ్‌ను పిలిచాడు. దీనిని మనసులో పెట్టుకొని జడ్‌పి వైస్ చైర్మన్ సుధాకర్ రెడ్డి కావాలనే తనపై దాడి చేశాడని సమరసింహారెడ్డి ఆరోపణలు చేశాడు. పార్కింగ్ విషయంలో కావాలనే గొడవ పెట్టుకున్న బాధితుడి ఆరోపణలు చేస్తున్నాడు. పొలాల్లో వెంటాడి కర్రలతో జవాన్ పై దాడి చేశారు. జవానుపై వైసిపి నాయకుల దౌర్జన్యకాండ సృష్టించారు. తీవ్ర గాయాలతో జవాన్ ఆస్పత్రిలో చేరారు. జవాన్ సమరసింహారెడ్డిని పరిటాల శ్రీరామ్ పరామర్శించారు.పరిటాల శ్రీరామ్‌ను ఇంటికి పిలవడంతోనే రాజకీయంగా కక్ష పెట్టుకున్నట్టు సమాచారం. గత కొంత కాలంగా అనంతపురంలో వైసిపి వర్సెస్ పరిటాల కుటుంబం మధ్య వర్గం పోరు మొదలైందని స్థానికులు వాపోతున్నారు.

Dharmavaram politics

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News