Monday, December 23, 2024

‘లోహ్రీ’ని బాబీ, మనుమళ్లతో ఎంజాయ్ చేసిన ధర్మేంద్ర!

- Advertisement -
- Advertisement -

ముంబై: ప్రముఖ హిందీ నటుడు పంటకోత పండుగ అయిన ‘లోహ్రీ’ని తన కుమారుడు బాబీ డియోల్, మనుమళ్లతో జరుపుకున్నారు. వారంతా దిగిన ఫోటోను బాబీ డియోల్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. అందులో ఆయన తండ్రితోపాటు కుమారుడు ఆర్యమాన్ డియోల్, తన సోదరుడు సన్నీ డియోల్ కుమారులు కరణ్ డియోల్, రాజ్‌వీర్ డియోల్‌తో కనిపించారు. ఆ ఫోటోకు బాబీ డియోల్ ‘హ్యాపీ లోహ్రీ’ అని శీర్షిక పెట్టాడు. దానికి కొన్ని ఎమోటికన్స్, హ్యాష్‌ట్యాగ్‌లుగా…హ్యాపీ లోహ్రీ, పిక్చర్ ఆఫ్ ద డే అని పెట్టాడు.

ఆ ఫోటోలో కుటుంబ సభ్యులంతా చాలా సాదీసీదా డ్రెస్సుల్లో(క్యాజువల్స్)నే కనిపించారు. ఫోటోలో సన్నీ డియోల్ లేకపోవడం ఓ లోటుగా అనిపించింది. అయితే అతడు ఆ ఫోటోలకు ప్రతిస్పందించి, హార్ట్ ఎమోజీ పోస్ట్ చేశాడు. చుంకీ పాండే, సచిన్ ష్రాఫ్ వంటి ఇతర నటులు లోహ్రీ సందర్భంగా డియోల్ కుటుంబానికి శుభాకాంక్షలు తెలిపారు. అభిమానులు కూడా తమ కామెంట్లు పోస్ట్ చేశారు.

ధర్మేంద్రకు ఇప్పుడు వయస్సు 87 సంవత్సరాలు. కరణ్ జోహార్ తీస్తున్న ‘రాకీ ఔర్ రాణికీ ప్రేమ్ కహానీ’లో ధర్మేంద్ర నటిస్తున్నారు. అందులో ఆయన రణ్‌వీర్ సింగ్, ఆలియా భట్, జయా బచన్, షబ్నా ఆజ్మీలతో కలిసి నటించబోతున్నారు. ఆ సినిమా ఏప్రిల్ 28న థియేటర్లలోకి రాబోతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News