Monday, December 23, 2024

కర్నాటక బిజెపి ఎన్నికల ఇన్‌చార్జిగా ధర్మేంద్ర ప్రధాన్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: త్వరలో జరగనున్న కర్నాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అధికార భారతీయ జనతా పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. కర్నాటక బిజెపి ఎన్నికల ఇన్‌చార్జిగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను శనివారం కేంద్ర పార్టీ నియమించింది. తమిళనాడు బిజెపి విభాగం అధ్యక్షుడు కె. అణ్ణామలైని కర్నాటక కో ఇన్‌చార్జిగా నియమించింది. ధర్మేంద్ర ప్రధాన్ గతంలో పలు ఎన్నికల ఇన్‌చార్జిగా పని చేశారు. యుపి అసెంబ్లీ ఎన్నికల ఇన్‌చార్జిగా ప్రధాన్ బిజెపిని అధికారంలోకి తీసుకొచ్చారు.

గతంలో కేంద్ర బిజెపి కార్యదర్శిగా పని చేసిన ప్రధాన్ బీహార్, ఉత్తరాఖండ్, జార్ఖండ్, కర్నాటక రాష్ట్రాల ఎన్నికల బాధ్యతలను నిర్వర్తించారు. కాగా వచ్చే మార్చి ఏప్రిల్‌లో జరగనున్న కర్నాటక అసెంబ్లీ ఎన్నికల కోసం అధికార బిజెపితో పాటుగా ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రజలకు చేరువ అయ్యే కార్యక్రమాలను చేపడుతున్న విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News