- Advertisement -
బెంగళూరు: కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఇన్‌ఛార్జీగా బిజెపి నియమించింది. ఈ విషయాన్ని శనివారం ఓ ప్రకటన ద్వారా ఆ పార్టీ ధ్రువీకరించింది. తమిళనాడు బిజెపి యూనిట్ అధ్యక్షుడు కె. అన్నామళై కో-ఇన్‌ఛార్జీగా ఉండనున్నారు. వచ్చే ఎన్నికల్లో ఓటర్ల వద్దకు మరింత సమీపం కావడానికి బిజెపి, ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తీవ్ర ప్రచారం చేస్తున్నాయి. ఎన్నికలు బహుశా ఏప్రిల్-మే మధ్యన ఉండొచ్చని తెలుస్తోంది.
ధర్మేంద్ర ప్రధాన్ మంచి ఆర్గనైజర్‌గా పనిచేస్తారని పేరుంది. గతంలో ఆయన అనేక ఎన్నికల టాస్క్‌లను సమర్థంగా నిర్వహించారు. మంచి నైపుణ్యం ఉన్న రాజకీయవేత్త. కర్నాటకలో కాంగ్రెస్‌కు గట్టి పోటీ ఇవ్వబోతున్నారు. దక్షిణాదిలో బిజెపి అడ్డా బిఠాయించేందుకు కర్నాటక ఊతంగా ఉంది. కర్నాటకలో ఇప్పటికే బిజెపి అధికారంలో ఉంది.
- Advertisement -