Thursday, January 23, 2025

ఈ నటుడిని గుర్తు పట్టారా… (వైరల్)

- Advertisement -
- Advertisement -

న్యూస్‌డెస్క్: బాలీవుడ్ యా౪క్షన్ హీరోగా, హీమ్యాన్‌గా పేరుపొందిన నటుడు ధర్మేంద్ర. సోలో హీరోగానే కాక మల్టీస్టారర్ చిత్రాలలో సైతం తన రాణించారు ధర్మేంద్ర. 1935 డిసెంబర్ 8న జన్మించిన ధర్మేంద్ర తన ఆరు దశాబ్దాల సినీ జీవితంలో 300కి పైగా చిత్రాలలో నటించారు. ఇప్పటికీ అడపాదడపా తన కుమారులైన సన్నీ దేవల్, బాబీ దేవల్ చిత్రాలలో నిస్తుంటారు ఆయన.

తాజాగా..తాను నటిస్తున్న తాజ్: డివైడెడ్ బై బ్లడ్ చిత్రంలో ఈ కొత్త లుక్‌తో కనిపించనున్నారు ధర్మేంద్ర. సూఫీ గురువు షేక్ సలీం చిస్తీ పాత్రంలో తాను ఈ చిత్రంలో చిన్నదైనా ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నానంటూ ట్విటర్‌లో వెల్లడించారు ధర్మేంద్ర. చిత్రంలోని తన లుక్‌ను కూడా ఆయన షేర్ చేశారు. చాలా రోజుల తర్వా మళ్లీ నటిస్తున్న తమ అభిమాన హీరోకు పలువురు నెటిజన్లు శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News