Monday, December 23, 2024

గ్రూప్-4, ఎఇఇ పరీక్షల ఫలితాలు విడుదల చేయాలని కోరుతూ ధర్నా

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : టిఎస్‌పిఎస్‌సి నిర్వహించిన గ్రూప్- 4, ఎఇఇ, ఇతర పరీక్షల ఫలితాలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం ఇందిరాపార్క్ వద్ద అభ్యర్థులు ధర్నా నిర్వహించారు. పరీక్షలు నిర్వహించి నెలలు గడిచిపోతున్నా ఇప్పటివరకు జనరల్ ర్యాంక్ జాబితాలు కూడా ఇవ్వడం లేదని అభ్యర్థులు వాపోయారు. కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం ఈ విషయంపై దృష్టి సారించి న్యాయ వివాదాలు పరిష్కరించి తమ పరీక్షల ఫలితాలు త్వరగా వచ్చేలా చూడాలని కోరారు. అలాగే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం త్వరగా చర్యలు తీసుకొని నూతన బోర్డును ఏర్పాటు చేయాలని అభ్యర్థులు డిమాండ్ చేశారు. ఈ దర్నాలో అభ్యర్థులు మహేందర్, గోవర్దన్, శరత్ చంద్ర, కిషోర్, చంద్ర శేకర్ రెడ్డి, మౌనిక, స్వప్న, సుజాత తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News