Sunday, December 29, 2024

కాంగ్రెస్ నాయకుల ధర్నా

- Advertisement -
- Advertisement -

కామారెడ్డి : పిసిసి రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, మాజి మంత్రి షబ్బీర్ అలీ ఆదేశాల మేరకు కామారెడ్డి జిల్లా కేంద్రంలో కామారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కేంద్రంలోని సిరిసిల్ల రోడ్డులో గల సబ్ స్టేషన్ ముందు ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు.

అనంతరం డిసిసి అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్ రావు, నాయకులు గూడె శ్రీనివాస్ రెడ్డి, పండ్ల రాజు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి మాటలను వక్రీకరిస్తూ బిఆర్‌ఎస్ నాయకులు ప్రజలను మభ్యపెట్టే ప్ర యత్నం చేస్తున్నారని అన్నారు. కరెంట్ విష యంలో రేవంత్ రెడ్డిపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. గతంలో ఉచిత కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్సెనని అన్నారు. రైతుల పట్ల కాంగ్రెస్ పార్టీకి ప్రత్యేక అనుభందం ఉందని చెప్పారు.

కార్యక్రమంలో గుడుగుల శ్రీనివాస్, గోనె శ్రీనివాస్, ఐరేని సందీప్, గుడ్ల శ్రీనివాస్, మహిళా అధ్యక్షురాలు పాక జ్ఞానేశ్వరి, కౌన్సిలర్ పాత శివక్రిష్ణమూర్తి, పంపరి లక్ష్మణ్, కారంగుల అశోకర్ రెడ్డి, రవీందర్ గౌడ్, యాదగిరి గౌడ్, ప్రవీణ్, అనిల్, ఎజాజ్, జావేద్, అతిక్, సలావుద్దీన్, రఫీక్, హనుమాన్ల రాజు, హోసన్న, భాస్కర్, సంతోష్, సారవంపల్లి సాయిలు, ముత్యం, సంతోష్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News