Monday, December 23, 2024

రేపు కలెక్టరేట్ ఎదుట కల్లుగీత కార్మికుల ధర్నా

- Advertisement -
- Advertisement -

సంగారెడ్డి టౌన్: గౌడ కులస్థుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే రెరవేర్చాలని కల్లుగీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ఆశన్నగౌడ్ అన్నారు. శనివారం సంగారెడ్డిలో కల్లుగీతకార్మిక సంఘం సంగారెడ్డి డివిజన్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గీత కార్మికులందరికీ ద్విచక్రవాహనాలు, కల్లుగీత కార్పోరేషన్‌కు కేటాయించిన బడ్జెట్‌కు నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సోమవారం సంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట చేపట్టే మహాధర్నాను విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కల్లుగీత కార్మిక సంఘం వర్కింగ్ ప్రసిడెంట్ జంగన్నగౌడ్,ప్రధాన కార్యదర్శి రమేష్‌గౌడ్, నాయకులు శ్రీనివాస్‌గౌడ్, కృష్ణాగౌడ్, రాజేష్‌గౌడ్, రాజుగౌడ్, శ్రీశైలం గౌడ్, జన్నయ్య గౌడ్‌లున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News