Sunday, December 22, 2024

ప్రజా భవన్‌ ముందు ఎమ్మెల్యే ప్రేమసాగర్‌ రావు బాధితుల ధర్నా

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/మంచిర్యాల: ప్రజాభవన్ ముందు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ సాగర్ రావు బాధితులు ఆందోళనకు దిగారు. వీరు తమ భూములను కబ్జా చేశారని ఆరోపిస్తూ బాధితులు నిరసన చేపట్టారు. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ సాగర్ రావు నుంచి తమ ప్లాట్లను కాపాడాలంటూ కాప్రా ప్లాట్ ఓనర్స్ నిరసన చేపట్టారు. కాప్రా సర్వేనెంబర్ 647/1, 648, 654లో భూమిని మంచిర్యాల కాంగ్రెస్ ఎమ్మెల్యే కబ్జా చేశారంటూ ధర్నాకు దిగారు. సీఎం రేవంత్ రెడ్డి తమకు న్యాయం చేయాలంటూ ఫ్లకార్డులతో ఆందోళన చేపట్టారు.

మరోవైపు ప్రజాభవన్‌లో ప్రజావాణి కార్యక్రమం ప్రారంభమైంది. ప్రజావాణిలో తమ సమస్యలు చెప్పుకోవడానికి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివస్తున్నారు. ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ సందర్భంగా ప్రజావాణికి డబల్ బెడ్ రూమ్ కోసం వస్తున్న దరఖాస్తుల సంఖ్య తగ్గింది. ప్రజావాణి నోడల్ ఆఫీసర్‌గా ఉన్న హరిచందన నల్గొండ కలెక్టర్‌గా బదిలీ అయిన నేపథ్యంలో ఐఏఎస్ దివ్యకి బాధ్యతలు అప్పగించారు. గతంలో ఆదిలాబాద్ కలెక్టర్‌గా పని చేసిన దివ్య‌కు ప్రజావాణి ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News