- Advertisement -
ధర్పల్లి: నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలో ఓ గ్రామానికి చ చెందిన అక్కాచెల్లెళ్లపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారం చేశారు. దుబ్బాక గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం…. ఓ వేడకకు అక్కాచెల్లెళ్లు వెళ్లి వస్తుండగా కారు లిఫ్ట్ ఇస్తామని ధన్ బాద్ తండాకు చెందిన యువకులు నమ్మించారు.
వారిని కారులో దుబ్బాక శివారులోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి వారిపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారం చేశారు. వారి నుంచి తప్పించుకొని ఒక యువతి రోడ్డు మీదకు రావడంతో గ్రామస్థులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దుబ్బాక గ్రామంలో యువకులు అటవీ ప్రాంతంలో వెతకగా ఓ యువతి నగ్నంగా కనిపించింది. వెంటనే ఆమెపై దుస్తులు కప్పారు. పోలీసుల ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరిని ఆరోగ్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
- Advertisement -