మాచో హీరో గోపీచంద్, ‘రామబాణం’ టీమ్ సినిమాను జోరుగా ప్రమోట్ చేస్తున్నారు. శ్రీవాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం యాక్షన్ అంశాలతో కూడిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమా ప్రామిసింగ్ ప్రమోషనల్ కంటెంట్ తో మంచి బజ్ నెలకొల్పింది. ఈ సినిమా ఫస్ట్ సింగిల్‌కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈరోజు కర్నూల్‌లో జరిగిన ఈవెంట్ లో సెకండ్ సింగిల్ దరువెయ్యరా పాటను విడుదల చేశారు.
మిక్కీ జె మేయర్ అద్భుతమైన ఆల్బమ్‌ని స్కోర్ చేశారు. దరువెయ్యరా పాట భక్తిరసంతో పండుగ వైబ్‌ని కలిగి ఉంది. ఈ పాటను దేవాలయం బ్యాగ్ డ్రాప్ లో చిత్రీకరించారు. కుటుంబ సమేతంగా యజ్ఞం చేయడం కనిపించింది. గోపీచంద్, జగపతి బాబు, ఖుష్బూ, డింపుల్ హయాతీ, ఇలా అందరూ సంప్రదాయ దుస్తుల్లో ఆకట్టుకున్నారు. వారందరినీ కలసి చూడటమే కన్నుల పండుగలా వుంది. ఈ పాటకు సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా, కృష్ణ తేజస్వి, చైత్ర అంబడిపూడి ఆకట్టుకునేలా పాడారు. ప్రేమ్ రక్షిత్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు.
Also read: బలగం మొగిలయ్యకు మంత్రి ఎర్రబెల్లి పరామర్శ
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. ఈ చిత్రంలో గోపీచంద్ పూర్తి భిన్నమైన పాత్రలో కనిపించనున్నారు. భూపతి రాజా ఈ చిత్రానికి కథను అందించగా, వెట్రి పళని స్వామి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. మధుసూదన్ పడమటి డైలాగ్స్ అందించగా, ప్రవీణ్ పూడి ఎడిటర్. ఈ చిత్రంలో సచిన్ ఖేడేకర్, నాజర్, అలీ, రాజా రవీంద్ర, వెన్నెల కిషోర్, సప్తగిరి, కాశీ విశ్వనాథ్, సత్య, గెటప్ శ్రీను, సమీర్, తరుణ్ అరోరా తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. సమ్మర్ కానుకగా మే 5న రామబాణం విడుదలకు సిద్ధమవుతోంది.