Thursday, January 9, 2025

క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ధావన్

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ క్రికెట్ కు రిటైర్‌మెంట్ ప్రకటించాడు. అంతర్జాతీయ, దేశవాళీ క్రికెట్‌కు ధావన్ రిటైర్‌మెంట్ ప్రకటించినట్టు తన ట్విట్టర్‌లో తెలిపాడు. ఇవాళ్టితో క్రికెట్ జర్నీకి ముగింపు పలుకుతున్నానని చెప్పాడు. క్రికెట్ జర్నీలో ఎన్నో మధురమైన జ్ఞాపకాలు ఉన్నాయని, ఆయనకు మద్దతు పలికిన క్రికెట్ అభిమానులకు ప్రేమతో కృతజ్ఞతలు చెప్పాడు. ధావన్ 34 టెస్టులు, 167 వన్డేలు, 68 టి20 మ్యాచ్‌లు ఆడాడు. టెస్టులో 2315 పరుగులు, వన్డేల్లో 6793 పరుగులు, టి20ల్లో 1759 పరుగులు చేశాడు. టెస్టుల్లో ఏడు సెంచరీలు, వన్డేల్లో 17 శతకాలు బాదాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News