Sunday, January 19, 2025

ఆ డబ్బు కాంగ్రెస్‌ది కాదు, మా కుటుంబానిదే: ధీరజ్ సాహు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: జార్ఖండ్‌కు చెందిన రాజ్యసభ కాంగ్రెస్ సభ్యుడు ధీరజ్ సాహుకు చెందిన లిక్కర్ సంస్థలు, బంధువుల నివాసాలనుంచి ఆదాయం పన్ను శాఖ అధికారులు ఇటీవల భారీ మొత్తంలో నగదు, బంగారం స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. దాదాపు వారం రోజుల పాటు ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల్లోని కంపెనీలు, నివాసాల్లో జరిపిన ఈ సోదాల్లో రూ.351 కోట్ల నగదుతో పాటు, పెద్ద మొత్ంతలో బంగారం కూడా పట్టుబడింది. ఈ నగదును లెక్కించడానికి బ్యాంకు అధికారులకు అనేక రోజులు పట్టగా, 40కి పైగా నగదు లెక్కించే యంత్రాల సాయం తీసుకున్నారు. ఇదంతా కాంగ్రెస్ పారీకి చెందిన ్ట నల్లడబ్బని బిజెపి ఆరోపిస్తోంది. కాగా ఈ వ్యవహారంపై ఎంపి ధీరజ్ సాహు తొలిసారి స్పందించారు.

పట్టుబడిన డబ్బు తన కుటుంబానికి చెందినదని, దీనితో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని ఆయన శుక్రవారం ఓ వార్తాసంస్థతో మాట్లాడుతూ చెప్పారు.‘ స్వాధీనం చేసుకున్న నగదు నా లిక్కర్ కంపెనీలకు చెందినది. మద్యం అమ్మకాల ద్వారా వచ్చిన డబ్బు అది. ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లుగా కాంగ్రెస్‌తో కానీ, మరే రాజకీయ పార్టీకి కానీ దీనితో సంబంధం లేదు’ అని సాహు చెప్పారు. పట్టుబడిన సొమ్మంతా తనది కాదని, తన కుటుంబానికి, ఇతర సంస్థలకు చెందిందని కూడా ఆయన చెప్పారు. ఇప్పుడు ఆదాయం పన్ను శాఖ దాడి చేసిందని, ప్రతిదానికీ తాను లెక్క చెబుతానని ఆయన చెప్పారు. స్వాధీనం చేసుకున్న సొమ్ము, నల్లధనమో, తెల్ల ధనమో ఐటి శాఖ నిర్ణయించే దాకా ఓపిక పట్టండని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News