Sunday, December 22, 2024

రైతుబీమాతో రైతు కుటుంబాలకు ధీమా

- Advertisement -
- Advertisement -
  • జహీరాబాద్ ఏడీఏ బిక్షపతి

కోహీర్: డివిజన్ పరిధిలోని అర్హులైన రైతులందరూ రైతుబీమాకు దరఖాస్తు చేసుకొని రైతులు ధీమాగా ఉండాలని ఏడీఏ బిక్షపతి సూచించారు. ఈ సందర్భంగా మంగళవారం మండలంలోని మద్రి గ్రామాన్ని ఏఓ నవీణ్‌తో కలిసి ఆయన సందర్శించి రైతుబీమాత పత్రాలను స్వీకరించారు. అనంతరం ఏడీఏ బిక్షపతి మాట్లాడుతూ అర్హులైన రైతులందరూ రైతుబీమాకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. అలాగే 18 జూన్ 2023 నాటికి పట్టా పాసుపుస్తకంపొంది 18ఏళ్ల నుం చి 59 ఏళ్లలోపు ఉన్న రైతులు అర్హులన్నారు. దరఖాస్తులు చేసుకునే వారందరూ ఏఈఓలకు అందజేయాలన్నారు. అలాగే మండల వ్యాప్తంగా మొత్తం 2962మంది అర్హులైన రైతులు ఉండగా ఇప్పటివరకు 456 మంది రైతులు మాత్రమే దరఖాస్తులు చేసుకున్నారని ఏవోనవీణ్ తెలిపారు. మిగతా రైతులందరూ దరఖాస్తులు చేసుకోవాలని కోరారు. ఏఈఓ సంధ్య, గ్రామ పెద్దలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News