స్కోర్: సుదీర్ఘ కాలం పాటు సాగిన కెరీర్లో ధోనీ ఎన్నో చిరస్మరణీయ రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. ఇండియన్ టీమ్ వరల్డ్ కప్ గెలిచి పదేళ్లయిన సందర్భంగా గల్ఫ్ ఆయిల్ ధోనీ 2005, ధోనీ 2021ల మధ్య జరిగే ఓ వీడియోను రిలీజ్ చేసింది. టీమ్‌లోకి వచ్చిన కొత్తలో అమాయకంగా కనిపించే ధోనీకి, ఇప్పుడు సుమారు రెండు దశాబ్దాల తర్వాత ఎన్నో రికార్డులను తన పేరిట రాసుకున్న ధోనీ తన అనుభవాన్ని చెబుతున్న వీడియో వైరల్‌గా మారింది. ఈ సందర్భంగా తన ఫేవరెట్ వన్డే ఇన్నింగ్స్ ఏదో ధోనీ చెప్పాడు. 2011, వరల్డ్‌కప్ ఫైనల్లో వాంఖెడేలో ఆడిన 91 పరుగుల ఇన్నింగ్సే తన ఫేవరెట్ ఇన్నింగ్స్ అని ధోనీ అన్నాడు. ఆ ఫైనల్లో టీమ్‌ను గెలిపించిన మజానే వేరు అని ధోనీ చెప్పాడు. ధోనీ vs ధోనీ వీడియో అభిమానులను ఆకట్టుకుంటోంది.
వికెట్ కీపర్‌గా, బ్యాట్స్‌మన్‌గా, కెప్టెన్‌గా ధోనీ భారత క్రికెట్‌పై తనదైన ముద్ర వేశాడు. అతని సారథ్యంలో టీమిండియా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి)లోని మూడు ప్రధాన ట్రోఫీలను గెలుచుకుంది. ధోనీ సారథ్యంలో భారత్ ట్వంటీ20 ప్రపంచకప్, వన్డే వరల్డ్‌కప్‌లతో పాటు ఛాంపియన్స్ ట్రోఫీలను సాధించింది. మరే భారత క్రికెట్ కెప్టెన్ కూడా ఇలాంటి ఘనత సాధించలేదు. 2004 డిసెంబర్ 23న బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే మ్యాచ్ ద్వారా ధోనీ భారత జట్టులోకి అడుగు పెట్టాడు. అప్పటి నుంచి ధోనీ మళ్లీ వెనుదిరిగి చూడలేదు. ప్రపంచ క్రికెట్లోని అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ధోనీ ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు.