Monday, December 23, 2024

బ్యాట్‌పై అతడి ఆటోగ్రాప్ మరిచిపోలేను: ఇషాన్ కిషన్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డేలో కీపర్ ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ చేయడంతో ఆయన క్రేజీ అమాంతం పెరిగిపోయింది. జట్టులో చోటు కల్పించడానికి అవకాశాలు కూడా వస్తున్నాయి. తాజాగా కొన్ని మధురమైన క్షణాల గురించి ఇషాన్ కిషన్ స్పందించారు. భారత మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని తన బ్యాట్‌పై సంతకం పెట్టడం ఎప్పటికి మరిచిపోనని ఇషాన్ కిషన్ తెలిపాడు. ధోని, ఇషాన్‌కిషన్‌ది జార్ఖండ్ రాష్ట్రానికి చెందినవారు. ధోనిని ఎక్కువగా ఆరాధిస్తానని వెల్లడించారు. తాను తొలిసారి ధోనిని కలిసినప్పుడు తనకు 18 ఏళ్లు ఉన్నాయని, అప్పడే ధోని ఆటోగ్రాఫ్ ఇవ్వాలని అడగడంతో తన బ్యాట్‌పై సంతకం చేశాడని ఇషాన్ చెప్పారు. ధోనిలా రాణించడానికి కృషి చేస్తానని వివరణ ఇచ్చాడు. బంగ్లాదేశ్‌పై ఇషాన్ 131 బంతుల్లో 210 పరుగులు చేశాడు. 13 వన్డేలు ఆడిన అతడు 507 పరుగులు చేశాడు. 24 టి20 మ్యాచ్‌ల్లో 629 పరుగులు చేశాడు. కెఎల్ రాహుల్ తన ఫామ్‌ను కొనసాగించలేకపోతే ఇషాన్ కిషన్ జట్టులోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News