Sunday, November 17, 2024

ధోనీని ‘కింగ్‌కాంగ్’ గా పిలవొచ్చు

- Advertisement -
- Advertisement -

Dhoni can be called 'King Kong':Ravi shastri

అతడికి దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు
ప్రశంసలతో ముంచెత్తిన రవిశాస్త్రి

న్యూఢిల్లీ: టీమిండియా సారథిగామహేంద్ర సింగ్ ధోనీ అత్యున్నత శిఖరాలను అధిరోహించాడు. తన సారథ్యంలో టీమిండియాకు ఎన్నో అద్భుత విజయాలను అందించడంతోపాటు ఉత్తమ జట్టుగా తీర్చిదిద్దాడు. ఈ క్రమంలోనే ఇప్పటివరకు ఏ సారథికి సాధ్యంకాని విధంగా అన్ని ఐసిసి ట్రోఫీలను గెలుచుకున్న కెప్టెన్‌గా రికార్డు సృష్టించాడు. మరో వైపు ఐపిఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ను అత్యుత్తమ జట్లలో ఒకటిగా నిలిపాడు. ఈ రికార్డులన్నీ అందరికీ తెలిసినవే. తాజాగా టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి పైతం ధోనీని మెచ్చుకున్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ధోనీ దరిదాపుల్లోకి కూడా ఎవరూ రాలేరన్నారు. అభిమానులతో ముచ్చటించిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశాడు. ‘ పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మహీ చిరస్థాయిగా నలిచిపోయే కెప్టెన్. ఐసిసి టోర్నమెంట్లలో అతడి రికారులను చూస్తేనే ఈ విషయం అర్థమవుతుంది. అతడు సాధించలేనిది ఏముంది? మూడు సార్లు ఐపిఎల్ ట్రోఫీలు, చాంపియన్స్ లీగ్‌లు, మూడు ఐసిసి ట్రోఫీలు.. ఇవన్నీ ధోనీ సామర్థాన్ని తెలియజేస్తున్నాయి.

అతడికి చేరువలో కూడా ఎవరూ లేరు. అతడెప్పటికీ ఇలాగే ఉండాలి. మీరు అతడిని ‘కింగ్‌కాంగ్’ అని కూడా పిలవొచ్చు. ఎందుకంటే అతడు కెప్టెన్సీ చేపట్టేటప్పుడు మ్యాచ్ మొత్తం అతడి అధీనంలో ఉంటుంది. పరిస్థితులు అన్నీ అదుపులో ఉంటాయి. మరోవైపు బ్యాటింగ్‌లోను సిక్స్‌లు, ఫోర్లతో అలరిస్తాడు’ అంటూ రవిశాస్త్రి పొగడ్తల వర్షం కురిపించాడు. ఇదిలా ఉండగా.. గత ఏడాది ఐపిఎల్‌లో ప్లే ఆఫ్స్ చేరకుండానే వెనుదిరిగిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టును ధోనీ ఈ సారి అందరికంటే ముందుగా టాప్‌లో ప్లేఫ్‌సకు చేర్చాడు. మరో వైపు ఐపిఎల్ తర్వాత జరిగే టి 20 ప్రపంచ కప్‌లోను టీమిండియాకు మెంటార్‌గా కొనసాగనున్నాడు. దీంతో ధోనీ పర్యవేక్షణలో కోహ్లీ సేన మరో పొట్టి కప్‌ను సాధిస్తుందేమోనని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News