Monday, December 23, 2024

ధోనీ ధనాధన్ దంచాడు… రికార్డు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ జరిగిన మ్యాచ్‌లో పృథ్వీ షా క్యాచ్ అందుకున్న ధోనీ 300 వికెట్లలో భాగస్వామైన తొలి వికెట్ కీపర్‌గా చరిత్ర సృష్టించాడు. ధోనీ(300) తొలి స్థానంలో ఉండగా కమ్రాన్ అక్మల్(274), దినేశ్ కార్తీక్(274), క్వింటన్ డికాక్(270), జోస్ బట్లర్(209) స్థానాలలో వరసగా ఉన్నారు. ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో చెన్నై ఘోర ఓటమిని చవిచూసింది. ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్ దిగిన ధోనీ బౌండరీలతో అలరించాడు. ధనాధన్ బ్యాటింగ్‌తో మెరుపులు మెరిపించాడు. 16 బంతుల్లో నాలుగు ఫోర్లు, మూడు సిక్స్‌లతో 37 పరుగులు చేశాడు. ధోనీ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఆయన అభిమానుల సంతోషానికి అవధులు లేకుండాపోయాయి. విశాఖ స్టేడియం మొత్తం పసుపుమయంగా మారింది.

 

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News