చెన్నై: ఐపిఎల్ 2023లో భాగంగా చెపాక్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నైసూపర్ కింగ్స్ ఓటమిని చవిచూసింది. సిఎస్‌కె కెప్టెన్ ఎంఎస్ ధోనీ చివరలో మూడు సిక్స్‌లు మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచాయి. చెన్నై ఓడితే ఓడింది ధోనీ మూడు సిక్స్‌లు చూసిన అనుభూతి కలిగింది. చివర ఓవర్లో సిఎస్‌కె 21 పరుగులు కావల్సి ఉండగా రెండు సిక్స్‌లు బాదడంతో రాజస్థాన్ గెలుపొందింది. ఆసమయంలో బ్రాడ్ కాస్టర్ జియో సినిమా వ్యూస్ రెండు కోట్లకు చేరింది.
Also Read: చెన్నై సూపర్ కింగ్స్ పై రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం
చివర ఓవర్‌లో రెండు సిక్స్‌లు మాత్ర 2.2 కోట్ల మంది వీక్షించారు. జియో సినిమా ఆల్‌టైమ్ రికార్డు తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది. లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోనీ రెండు సిక్స్‌లు బాదడంతో 1.7 ఓట్ల వ్యూస్ వచ్చాయి. ధోనీకి 41 ఏళ్ల ఉన్నప్పటికి అతడిలో సత్తా మాత్రం తగ్గడం లేదు. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ సిఎస్‌కె ముందు 176 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. సిఎస్‌కె 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 172 పరుగులు చేసి ఓటమి పాలైంది. మూడు పరుగుల తేడాతో ఆర్‌ఆర్ ఘనవిజయం సాధించింది. ఐపిఎల్‌లో అత్యధికంగా సిక్స్‌లు కొట్టిన ఆటగాడి క్రిష్ గేల్(357) ఉండగా వరసగా ఎబి డివిలియర్స్(251), రోహిత్ శర్మ(245), ఎంఎస్ ధోనీ(235), విరాట్ కోహ్లీ(227)లు ఉన్నారు.
𝑽𝒊𝒏𝒕𝒂𝒈𝒆 𝑴𝒂𝒉𝒊 🤩
Rewind Dhoni's late blitz from #CSKvRR & keep watching #IPLJioCinema 🙌#TATAIPL #IPL2023 | @msdhoni pic.twitter.com/k09CU93AC5
— JioCinema (@JioCinema) April 12, 2023