Wednesday, January 22, 2025

ధోనీ క్రికెట్ అకాడమీ ప్రారంభం

- Advertisement -
- Advertisement -

Dhoni cricket academy opened in Hyderabad

 

మన తెలంగాణ/హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ నేతృత్వంలో నిర్వహిస్తున క్రికెట్ అకాడమీని తాజాగా హైదరాబాద్‌లోనూ ప్రారంభించారు. నాచారంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో ఈ అకాడమీని ఏర్పాటు చేశారు. శుక్రవారం రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి దీన్ని ప్రారంభించారు. ప్రపంచ శ్రేణి ప్రమాణాలతో అకాడమీని ఏర్పాటు చేయడంపై మంత్రి హర్షం వ్యక్తం చేశారు. ప్రతిభావంతులైన క్రికెటర్లను తీర్చిదిద్దేందుకు అకాడమీ దోహదం చేస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ ఎంఎల్‌ఎ సుభాష్ రెడ్డి, రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాట్స్) చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చైర్మన్ మల్కా కొమరయ్య, సిఇఓ యశస్వి తదితరులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News