Monday, December 23, 2024

ధోని అభిమాని ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

చెన్నై: మహేంద్ర సింగ్ ధోనీ వీరాభిమాని గోపికృష్ణన్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన తమిళనాడు రాష్ట్రం కడలూరు జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. అరంగూర్‌లో గోపి కృష్ణన్(35), అన్భరసి అనే దంపతులు నివసిస్తున్నారు. ఈ దంపతులు ముగ్గురు పిల్లలు ఉన్నారు. కిశోర్, శక్తివేల్ కుమారులు ఉండగా పది రోజుల క్రితం కూతురు జన్మించింది. ధోనీ వీరాభిమాని గోపి కృష్ణన్. చెన్నై సూపర్ కింగ్ జర్సీ పసుపు రంగు కావడంతో తన ఇంటిని పసుపు రంగుగా మార్చాడు. ధోని ఫోటోలను ఇంటి గోడలపై పెయింట్ రూపంలో వేయించాడు. బుధవారం రాత్రి సమయంలో డబ్బుల విషయంలో గోపి కృష్ణన్ తో కొందరు వ్యక్తులు గొడవకు దిగారు. ఈ క్రమంలో గోపిని చితకబాది అక్కడి నుంచి వెళ్లిపోయారు. మనస్థాపం చెందిన గోపి ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News