Thursday, January 9, 2025

ధోనీ వీరాభిమాని ఆత్మహత్య..

- Advertisement -
- Advertisement -

టీమిండియా మాజీ సారథి మ‌హేంద్ర సింగ్ ధోనీ వీరాభిమాని ఆత్మ‌హ‌త్య చేస‌కున్నాడు. గోపి కృష్ణ‌న్(34) అనే ధోనీ అభిమాని తన ఇంట్లో ప్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన త‌మిళ‌నాడు కడ్డ‌లోర్ జిల్లాలోని రంగూర్ గ్రామంలో చోటుచేసుకుంది. ఆర్థిక లావాదేవీల విష‌య‌ంలో జ‌రిగిన గొడ‌వ‌ల కారణంగా కృష్ణ‌న్ ఆత్మ‌హ‌త్య‌ చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై పోలసీులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కాగా, గోపి కృష్ణ‌న్ కు.. ఎంఎస్ ధోనీ అంటే ప్రాణం ఇచ్చేంత అభిమానం. ఐపిఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అన్నా.. ఆ జట్టు కెప్టెన్ ధోనీ అన్నా ఎంతో అభిమానం. ఆయన మీద ఉన్న అభిమానం చూపించేందుకు.. తన ఇంటికి మొత్తం చెన్నై జట్టు పసుపు కలర్ తోపాటు ధోనీ బొమ్మలను వేయించాడు. ఆ ఇంటికి హోమ్ ఆఫ్ ధోనీ ఫ్యాన్ అని పేరు కూడా పెట్టించాడు. ఈ ఇంటికి సంబంధించిన వీడయో కూడా అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యి ధోనీ కంట పడింది. ఈ వీడియోపై ధోనీ స్పందిస్తూ ఆనందం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా గోపి కృష్ణ‌న్, అతని కుటుంబ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ధోనీ.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News