Wednesday, January 22, 2025

సిఎస్‌కె కెప్టెన్సీకి ధోనీ గుడ్‌బై?

- Advertisement -
- Advertisement -

Dhoni goodbye to CSK captaincy?

 

చెన్నై: ఐపిఎల్ ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్ (సిఎస్‌కె) అభిమానులకు ఇది చేదు వార్తే. సిఎస్‌కె టీమ్ సారథ్య బాధ్యతల నుంచి మహేంద్ర సింగ్ ధోనీ తప్పుకున్నట్టు సమాచారం. జట్టు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ధోనీ ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు తెలిసింది. ఇక ధోనీ స్థానంలో రవీంద్ర జడేజా కెప్టెన్సీ చేపట్టే అవకాశాలు ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. కిందటి సీజన్‌లో ధోనీ సారథ్యంలో చెన్నై మరోసారి ఐపిఎల్ ట్రోఫీని ముద్దాడింది. దీంతో మరికొంత కాలం పాటు అతనే సారథిగా ఉంటాడని అందరూ భావించారు. కానీ జట్టు ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ధోనీ కెప్టెన్సీ నుంచి తప్పించుకోవాలని భావిస్తున్నట్టు తెలిసింది. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ధోనీ త్వరలోనే ఐపిఎల్ నుంచి కూడా తప్పుకోవాలనే ఆలోచనతో ఉన్నాడు. ఈ సీజన్ తర్వాత అతను ఐపిఎల్ నుంచి తప్పుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. సొంత గడ్డపై చివరి మ్యాచ్ ఆడాలనే ఉద్దేశంతో ధోనీ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నాడు. ఈసారి భారత్‌లోనే ఐపిఎల్ జరిగే అవకాశాలు అధికంగా ఉన్నాయి. దీంతో ధోని ఐపిఎల్‌కు వీడ్కోలు పలకడం ఖాయంగా కనిపిస్తోంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News