Thursday, January 23, 2025

ధోనీ ఇన్నింగ్స్‌కు ఫిదా!

- Advertisement -
- Advertisement -

Dhoni goodbye to CSK captaincy?
ముంబై: ఐపిఎల్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్ (సిఎస్‌కె) సీనియర్ బ్యాట్స్‌మన్ మహేంద్ర సింగ్ ధోనీ ఆడిన ఇన్నింగ్స్‌పై సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు వెల్లువెత్తాయి. చివరి ఓవర్‌లో విజయం కోసం చెన్నైకి 17 పరుగులు అవసరమయ్యాయి. అప్పటికే కీలక బ్యాటర్లు పెవిలియన్ చేరడంతో చెన్నైపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. అయితే ధోనీ మాత్రం తన మార్క్ బ్యాటింగ్‌తో సిఎస్‌కెకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. రెండు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 17 పరుగులు సాధించాడు. ఈ ఇన్నింగ్స్‌తో ధోనీలోని ఫినిషర్ మరోసారి బయటపడ్డాడు. అసాధారణ షాట్లతో విరుచుకు పడిన ధోనీ చెన్నైకి చిరకాలం గుర్తుండి పోయే విజయాన్ని సిఎస్‌కె అందించాడు. ధోనీ అద్భుత ఇన్నింగ్స్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. తనలో సత్తా తగ్గలేదని మరోసారి నిరూపించాడని అభిమానులు, మాజీ క్రికెటర్లు అతన్ని పొగడ్తలతో ముంచెత్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News