Saturday, January 18, 2025

ధోనీ… ఇదేం పని?… మండిపడుతున్న నెటిజన్లు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ధోనీ అంటే చాలు రెండు ప్రపంచ కప్‌లు అందించిన విషయాలు గుర్తుకు వస్తాయి. టి20, వన్డే వరల్డ్‌కప్‌లు అందించిన ఘనత ధోనీకే దక్కుతుంది. ఎంత ఎత్తుకు ఎదిగిన ఒదిగి ఉండే లక్షణం దోనీలో ఎక్కువగా కనిపిస్తుంది. ఎక్కడికి వెళ్లిన హంగు ఆర్భాటాలు అంటూ ఏమీ ఉండవు. గెలుపోటములు సహజంగా తీసుకుంటాడు. మైదానంలో ఉన్నంత సేపు చాలా కూల్‌గా కనిపిస్తాడు, ఎక్కడ కూడా ప్రశాంతతను కోల్పోడు… తన సహచర ఆటగాళ్లపై ఆగ్రహం వ్యక్తం చేసిన క్షణాలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. కానీ ఓ విషయంలో మాత్రం ధోనీపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. నలుగురికి ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తి ఇలా చేశాడేంటని మండిపడుతున్నారు. ధోనీ తన స్నేహితులతో కలిసి హుక్కా తాగుతూ కనిపించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో ధోనీ తీరుపై నెటిజన్లు మండిపడ్డారు. సమాజానికి ఏం మెస్సేజ్ ఇందామని ఇలా హుక్కా తాగారాని కామెంట్లు వస్తున్నాయి. ఈ వీడియోలో కనిపిస్తుంది ధోనీ కాదని ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ సాయంతో డిప్ ఫేక్ వీడియో సృష్టించారని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. దీంతో ధోని అభిమానులకు, ఆయన వ్యతిరేకించే వర్గానికి మధ్య సోషల్ మీడియాలో వార్ జరుగుతోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News