Monday, December 23, 2024

డ్రోన్ స్టార్టప్‌లో ధోనీ పెట్టుబడులు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ప్రముఖ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ చెన్నైకి చెందిన ఇండియన్ డ్రోన్ స్టార్టప్ గరుడ ఏరోస్పేస్‌లో పెట్టుబడి పెట్టారు. అయితే ఆయన ఎంత పెట్టుబ డి పెట్టాడనే విషయం వెల్లడించలేదు. అంతేకాదు ఈ స్టార్టప్‌కు ఆయన బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా వ్యవహరించనున్నారు. ఎంఎస్ ధోని మాట్లాడుతూ, గరుడ ఏరోస్పేస్‌లో భాగమైనందుకు సంతోషిస్తున్నానని అ న్నారు. గరుడ సంస్థ అందించే డ్రోన్ పరిష్కారాలతో పాటు వారి వృద్ధి కథనాన్ని చూడటానికి ఎదురుచూస్తున్నానని అన్నారు.

అదానీ, అంబానీలు కూడా..

అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ ( ఎఇఎల్) అనుబంధ సంస్థ అదానీ డిఫెన్స్ సిస్టమ్స్ అండ్ టెక్నాలజీస్ మే 27న వ్యవసాయ డ్రోన్ స్టార్టప్ జనరల్ ఏరోనాటిక్స్‌లో 50 శాతం వాటాను కొనుగోలు చేసింది. 2022 జూలై 31 నాటికి ఈ కొనుగోలు ప్రక్రియ పూర్తవుతుందని అదానీ ఎంటర్‌ప్రైజెస్ తెలిపింది. మరోవైపు, ముకేశ్ అంబానీకి చెందిన జియో ప్లాట్‌ఫామ్‌లకు చెందిన రెండు అనుబంధ కంపెనీలు కూడా డ్రోన్‌లను తయారు చేస్తున్నాయి. బెంగళూరుకు చెందిన ‘ఆస్టెరియా ఏరోస్పేస్ లిమిటెడ్’ అనేది సాఫ్ట్‌వేర్‌తో పాటు డ్రోన్ హార్డ్‌వేర్‌పై పనిచేసే ఫుల్-స్టాక్ డ్రోన్ టెక్నాలజీ కంపెనీగా ఉంది. మరోవైపు సాంఖ్యసూత్ర ల్యాబ్స్, జియో ప్లాట్‌ఫామ్‌కు చెందిన మరొక సంస్థ, మల్టీఫిజిక్స్, ఇది ఏరోడైనమిక్స్ సిమ్యులేషన్ సాఫ్ట్‌వేర్, డీప్ టెక్నాలజీలో ప్రత్యేకత కలిగి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News