చెన్నై: చిదంబర్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో చెన్నై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మహేంద్ర సింగ్ ధోనీ చేసిన స్టంపింగ్ మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచింది. 43 ఏళ్ల వయసులో 0.12 సెకన్లలో స్టంపింగ్ చేయడంతో క్రికెట్ అభిమానులు ఆశ్చర్యపోయారు. 11 ఓవర్‌లో సిఎస్‌కె బౌలిర్ నూర్ అహ్మద్ వేసిన బంతిని ఎంఐ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ ఆడటానికి ప్రయత్నించాడు. క్రీజులో నుంచి ముందుకు వెళి బంతిని కొట్టడానికి ప్రయత్నించాడు. బంతి వెళ్లి కీపర్ ధోని చేతిలో పడడంతో 0.12 సెకన్లలో వికెట్లను గిరాటేశాడు. దీంతో సూర్య కుమార్ షాక్‌కు గురయ్యాడు. ధోనీకి వయసు పెరుగుతున్న కొలదీ యవ్వనం వస్తుందని క్రికెట్ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ధోనికి 50 ఏళ్లు వచ్చేవరకు సిఎస్‌కె యజమాన్యం అతడితో ఆటను కొనసాగించే అవకాశాలు ఉన్నాయని ధోని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ధోని చివరలో బ్యాటింగ్ వచ్చినప్పుడు ధోని నామంతో చిదంబరం స్టేడియం మార్మోగిపోయింది.
Speed of Loght #Thala #Dhoni 💕🩵 pic.twitter.com/JGlrDzq5tP
— Kale Keto (@KaaLeKeeto) March 24, 2025
View this post on Instagram
Ishq bhi tum aur sukoon bhi tum. @msdhoni naam nahi emotion hai emotion !!! ❤️🧿#Dhoni #CSKvMI #IPL2025
— Dinesh Kumar (@socialist_dky) March 24, 2025