Sunday, December 22, 2024

దుమ్మురేపిన ‘ధూమ్ ధామ్ ధోస్తాన్..’

- Advertisement -
- Advertisement -

Dhoom Dhaam Dhosthaan From Nani’s Dasara is Out

నేచురల్ స్టార్ నాని ప్రతిష్టాత్మక పాన్ ఇండియా చిత్రం ‘దసరా’ మేకర్స్ ప్రమోషనల్ వీడియోతో సినిమా ఫస్ట్ సింగిల్‌పై భారీ హైప్‌ని క్రియేట్ చేశారు. నాని రగ్గడ్ లుక్ తో కనిపించిన ఫస్ట్ సింగల్ గ్లింప్స్ వీడియో క్యూరియాసిటీని పెంచింది. ఇప్పుడా నిరీక్షణ తెర దించుతూ ధూమ్ ధామ్ ధోస్తాన్ పాటను మేకర్స్ విడుదల చేశారు. తెలంగాణ-శైలి జానపదంతో పాట ప్రారంభమైయింది. తన టీమ్, బ్యాండ్ లో ఎనర్జీని నింపడానికి కి మద్యం బాటిల్‌ను అందిస్తాడు నాని. తర్వాత, ఆర్కెస్ట్రా బీట్స్‌ పెంచడంతో ధూమ్ ధామ్ ధోస్థాన్   మాసియెస్ట్ లోకల్ స్ట్రీట్ సాంగ్ గా మాస్ జాతర క్రియేట్ చేసింది.

నాని క్యారెక్టర్ లుక్,  మేకోవర్‌కి మునుపెన్నడూ చూడని విధంగా వుంది. నాని, అతని బ్యాచ్ అద్భుతమైన,  డైనమిక్ డ్యాన్స్ మూవ్స్ తో బొగ్గు గనులలో దుమ్ము రేపారు. సంతోష్ నారాయణ్ ఈ పాటను కంపోజ్ చేయగా, రాహుల్ సిప్లిగంజ్, పాలమూరు జంగిరెడ్డి, నర్సమ్మ, గొట్టె కనకవ్వ, గన్నోర దాసు లక్ష్మి పాడారు. తెలంగాణా స్టైల్‌లో కాసర్ల శ్యామ్ ఈ పాటను  ఆకట్టుకునేలా రాశారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. నేషనల్ అవార్డ్ విన్నర్  కీర్తి సురేష్ ఈ సినిమాలో నానికి జోడిగా నటిస్తోంది. సముద్రఖని, సాయి కుమార్, జరీనా వహాబ్ కీలక  పాత్రలలో కనిపించనున్న ఈ చిత్రానికి సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫర్ గా పని చేస్తున్నారు. ఈ చిత్రానికి ఎడిటర్‌గా నవీన్‌ నూలి, ప్రొడక్షన్‌ డిజైనర్‌గా అవినాష్‌ కొల్లా, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాతగా విజయ్‌ చాగంటి వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో 30 మార్చి 2023న విడుదల కానుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News