గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం గేమ్ ఛేంజర్. ఈ మూవీ నుంచి తాజాగా డోప్ సాంగ్ ను మేకర్స్ విడుదల చేశారు. డల్లాస్‌లో ప్రీరిలీజ్ వేడుక సందర్భంగా విడుదలైన ఈ లిరికల్ సాంగ్ తమన్ సంగీతం అందించగా.. రామజోగయ్యశాస్త్రి సాహిత్యం అందించారు. తమన్, రోషిణి జేకేవీ, పృథ్వీ, శ్రుతి రంజని ఈ పాటను పాడారు. అయితే, ఈ పాట అంత గజి బిజీగా ఉందని.. అసలు ఇలా ఉందేంటని అభిమానులు థమన్ పై మండిపడుతున్నారు. ఎంతోగానో ఊహిస్తే.. మాకు పెద్ద షాకే ఇచ్చాడని.. పాటలో విజువల్స్, చరణ్ స్టెప్స్ తప్ప అసలు అర్థం కాలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శంకర్-ఏఆర్ రెహ్మాన్ కాంబోలో సాంగ్స్ ఎంత పెద్ద హిట్ అయ్యాయో అందరికి తీలిసిందే. కానీ, ‘గేమ్ ఛేంజర్’లో అలాంటి సాంగ్ కనిపించడంలేదని ఫ్యాన్స్ వర్రీ అవుతున్నారు. థమన్ కు బదులగా రెహ్మాన్ తీసుకుంటే బాగుండేదని ఫీలవుతున్నారు. మరి, సినిమానైనా అభిమానులను అలరిస్తుందో లేదో చూడాలి. సంక్రాంతి కానుకగా జనవరి 10న ఈ సినిమా విడుదల కానుంది.
గేమ్ ఛేంజర్ మూవీ నుంచి డోప్ సాంగ్ వచ్చేసింది..
- Advertisement -
- Advertisement -
- Advertisement -