Wednesday, January 22, 2025

“ధృవ నక్షత్రం” నుంచి ‘కరిచే కళ్లే…’ లిరికల్ సాంగ్

- Advertisement -
- Advertisement -

వర్సెటైల్ యాక్టర్ చియాన్ విక్రమ్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ “ధృవ నక్షత్రం”. రితూ వర్మ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాను టాలెంటెడ్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఓండ్రగ ఎంటర్ టైన్ మెంట్, ఒరువూరిలియోరు ఫిల్మ్ బ్యానర్స్ పై నిర్మిస్తూ.. రూపొందిస్తున్నారు. రెండు భాగాలుగా తెరపైకి రానున్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్ “ధృవ నక్షత్రం, ఛాప్టర్ 1 యుద్ధకాండం” ఈ నెల 24న థియేటర్స్ లో గ్రాండ్ గా విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది.

“ధృవ నక్షత్రం, ఛాప్టర్ 1 యుద్ధ కాండం” నుంచి ‘కరిచే కళ్లే..’ లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. హ్యారిస్ జయరాజ్ సంగీతాన్ని అందించిన ఈ పాటకు రాకేందు మౌళి లిరిక్స్ రాయగా..శ్రీలేఖ పార్థసారధి పాడారు. ‘కరిచే కళ్లే చూసి కుదేలయ్యానయ్యా…గరుకు ఒళ్లే నన్ను లాగెనురా బాయ్యా…వయసిక ఆగనంది అట్టా ఇట్టాగుంది..యెంటనే తాంబూలాలు మార్చేసుకోమంది…’ అంటూ హీరోయిన్ లవ్ ఫీలింగ్స్ చెబుతూ సాగుతుందీ పాట. బ్యూటిఫుల్ మెలొడీగా హ్యారీస్ జయరాజ్ కంపోజ్ చేసిన ఈ పాట అమ్మాయిల లవ్ ఆంథెమ్ కానుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News