Sunday, December 22, 2024

గ్రేటర్‌లోని ఆలయాలకు ధూప దీప నైవేథ్య పథకం

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ హైదరాబాద్ : తెలంగాణ గడ్డపై.. అద్భుత దృశ్యాన్ని ఆవిష్కరించుకుంటున్న మధుర ఘట్టంలో తాను భాగస్వామ్యం కావడం ఎంతో గర్వ కారణంగా ఉందని అటవీ, దేవాదాయ శాఖల మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఆదివారం నూతన సచివాలయంలోని 4వ అంతస్తు లోని తన ఛాంబర్‌లోని సీట్లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సీనులయ్యారు. ఈ సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 4 జిల్లాలోని 100 ఆలయాలకు ధూప దీప నైవేద్య పథకం వర్తింపజేస్తు ఫైల్ పై సంతకం చేశారు.

భక్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రధాన దేవాలయాల్లో మిల్లెట్ ప్రసాదాన్ని అందుబాటులోకి తెచ్చే ఫైల్ పై సంతకం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీకను, పరిపాలనా సౌధాన్ని ఠీవిగా, రాజసం ఉట్టిపడేలా సచివాలయాన్ని నిర్మించారని అభివర్ణించారు. ఈ సందర్బంగా తెలంగాణ ప్రజలకు, అధికారులకు, సిబ్బందికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News