Monday, December 23, 2024

ఘనంగా జరిగిన రామ లక్ష్మణుల గురు సమ్మేళనం

- Advertisement -
- Advertisement -

వసుధైక ఫౌండేషన్ ప్రథమ వార్షికోత్సవ వేడుకలు ‘ధ్యానయోగం II’, రామ లక్ష్మణుల ఆధ్యాత్మిక గురు సమ్మేళనం కార్యక్రమం వైభవంగా జరిగింది. కన్నుల పండుగగా జరిగిన ఈ వేడుకలో ప్రముఖ ఆధ్యాత్మిక గురువులు సదానంద గిరి గురూజీ, ప్రభాకర్ గురూజీ, బోలేనాథ్ గురూజీ, లక్షణానంద గురూజీ, బిక్షమయ్య గురూజీ, సూర్య నారాయణ గురూజీ పాల్గొని.. తమ దివ్య ప్రవచనాలను అందించారు. అలాగే చిత్ర పరిశ్రమ నుంచి రచయిత, నటుడు, దర్శకుడు తనికెళ్ళ భరణి, నటుడు రాజారవీంద్ర తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆధ్యాత్మిక గురువులు, ఆధ్యాత్మిక ప్రముఖులను రామ లక్ష్మణులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో తనికెళ్ళ భరణి మాట్లాడుతూ “కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలను బయటికి తీసి పడేయాలి. ధ్యానం మనకోసమే కాదు ప్రపంచం కోసం. వసుధైక కుటుంబం కోసం”అని అన్నారు.రామ లక్ష్మణులు మాట్లాడుతూ “వసుధైక ఫౌండేషన్‌కి మా తరపున లక్ష రూపాయిల విరాళం ఇస్తున్నాం. వారి అద్వర్యంలో అనేక మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి”అని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News