టైప్2 డయాబెటిస్ చికిత్సకు సాధారణంగా వినియోగించే ‘సెమాగ్లుటైడ్’ అనే ఔష ధం డయాబెటిస్‌లో ఎదురయ్యే గుండెపోటు, పక్షవాతం వంటి ప్రమాదకర పరిస్థితులను 14 శాతం వరకు తగ్గిస్తుందని అధ్యయనం వెల్లడించింది. యూనివర్శిటీ ఆఫ్ నార్త్ కరోలినా లోని డయాబెటిస్ కేర్ సెంటర్ డైరెక్టర్, ప్రొఫెసర్ ఆఫ్ మెడిసిన్, ఎండోక్రైనాలజిస్ట్ జాన్ బ్యూస్ ఈ అధ్యయనానికి నేతృత్వం వహించారు. డయాబెటిస్ రోగుల్లో రక్తంలోని చక్కెరస్థాయిలను సరిగ్గా నిర్వహించడానికి సెమాగ్లుటైడ్ సహాయపడుతు ంది. అలాగే శరీరం బరువు తగ్గినా, ఊబకాయం వచ్చినా చికిత్సలో ఈ డ్రగ్ ప్రభావం చూపిస్తు ంది. టైప్ 2 డయాబెటిస్ రోగులకు నోటి ద్వారా సెమోగ్లుటైడ్‌ను పంపిస్తే గుండెరక్తనాళాలు గడ్డకట్టడం,
మూత్రపిండాల వ్యాధులను నివారించడానికి ఉపయోగపడుతుందని పరిశోధకులు తమ అధ్యయనంలో కనుగొన్నారు. ఈ అధ్యయనంలో 50 ఏళ్లు పైబడిన టైప్2 డయాబెటిస్ , రక్తనాళాలు గడ్డకట్టే గుండెజబ్బు రోగులను మూత్రపిండాల వ్యాధిగ్రస్తులను మొత్తం 9650 మందిని చేర్చుకున్నారు. వీరికి రోజూ నోటి ద్వారా 14 ఎంజీ సెమాగ్లుటైడ్ ఔషధంతోపాటు ఏమాత్రం ప్రభావం చూపని పదార్థాన్ని కూడా ఇచ్చారు. గ్లూకోజ్ స్థాయిలను , గుండె నాళాల రిస్కును తగ్గించడానికి ఉపయోగించే ప్రామాణిక చికిత్సను వీరికి నిర్వహించారు. ఈ ప్రయోగంలో డెమ్మీ ఔషధం కన్నా సెమాగ్లుటైడ్ వినియోగించిన వారిలో సత్ఫలితాలు కనిపించాయి. గుండెపోటు రిస్కు చాలావరకు తగ్గిందని పరిశోధకులు వెల్లడించారు.