పెన్ స్టేట్ కాలేజీ ఆఫ్ మెడిసిన్ అధ్యయనం
వాషింగ్టన్ : స్థూలకాయం, టైప్ 2 డయాబెటిస్‌ను తగ్గించడానికి వైద్యచికిత్సలో ఉపయోగించే తీవ్ర కొవిడ్ రిస్కును కూడా తగ్గిస్తుందని తాజా అధ్యయనం వెల్లడించింది. అమెరికా లోని పెన్ స్టేట్ కాలేజీ ఆఫ్ మెడిసిన్ కు చెందిన పరిశోధకులు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. 2020 జనవరి సెప్టెంబర్ మధ్య కొవిడ్ పాజిటివ్ సోకిన టైప్ 2 డయాబెటిస్ రోగులు దాదాపు 30 వేల మందికి చెందిన ఎలెక్ట్రానిక్ మెడికల్ రికార్డులను విశ్లేషించారు. ఈ అధ్యయనం జర్నల్ డయాబెటిస్‌లో మంగళవారం వెలువడింది. గ్లూకగన్ వంటి పెప్టైడ్ 1 రెసిప్టర్ (జిపిఎల్ 1 ఆర్)వంటి ఔషధాలు కొవిడ్ తీవ్ర సమస్యల నుంచి రక్షణ కల్పిస్తాయని పరిశోధకులు వివరించారు. అద్యయనంలో జిఎల్‌పి 1 ఆర్ చికిత్స వల్ల కొవిడ్ నుంచి ఎక్కువ రక్షణ కలుగుతుందని తేలిందని, అయితే ఈ ఔషధాల వినియోగానికి, కొవిడ్ తగ్గడానికి ఉన్న సంబంధాలపై మరింత అధ్యయనం చేయాల్సి ఉందని ప్రొఫెసర్ పట్రిసియా గ్రిగ్సన్ పేర్కొన్నారు.