Saturday, November 16, 2024

పేదలకు వరంగా మారిన డయాగ్నస్టిక్ మినీ హబ్‌లు

- Advertisement -
- Advertisement -

Diagnostic mini hubs that have become boon to poor

 

నగరంలో 08 కేంద్రాలు అందుబాటులోకి తెచ్చిన వైద్యశాఖ
ఉచితంగా ఎక్స్‌రే, సీటీస్కాన్, ఎంఆర్‌ఐ, అల్ట్రాసౌండ్ పరీక్షలు
రోజుకు 70నుంచి 80మందికి టెస్టులు చేస్తున్న ఆరోగ్య సిబ్బంది
రోగులు పెరుగుతుండటంతో మరో 08 హబ్‌లకు అధికారుల ప్రయత్నాలు

మన తెలంగాణ, హైదరాబాద్ :  నగరంలో పేదలకు కార్పొరేట్ స్దాయిలో వైద్యం అందించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న నూతన విధానాలతో నగర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత నెల రోజుల కితం వైద్యశాఖ డయాగ్నస్టిక్ మినీ హబ్‌లు ప్రారంభించి రోగులకు ఉచితంగా సేవలు అందిస్తుండటంతో ప్రజలు హబ్‌లకు వెళ్లి పలు రకాల పరీక్షలు చేయించుకుని ఆరోగ్యం కాపాడుకుంటున్నారు. గతంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం కోసం వెళ్లితే వివిధ రకాల టెస్టుల వైద్యులు ఆఫర్ చేయడంతో సమీపంలోని ప్రైవేటు డయాగ్నస్టిక్ సెంటర్ల వెళ్లి వేల రూపాయలు చెల్లించి రిపోర్టు తీసుకుని చికిత్సలు పొందేవారు. కొంతమంది ల్యాబ్ పరీక్షలు చేయించుకోలేక వ్యాధులతో అనేక అవస్దలు పడేవారు. పేదల ఇబ్బందులు గుర్తించిన జిల్లా వైద్యశాఖ నగరంలో 16 డయాగ్నస్టిక్ హబ్ ప్రారంభించేందుకు చర్యలు చేపట్టి ముందుగా 08 ల్యాబ్‌లు అందుబాటులోకి తీసుకరావడంతో గ్రేటర్ వాసులు ప్రభుత్వ వైద్య సేవలపై ప్రశంసలు కురిపిస్తున్నారు. గత వారం రోజుల నుంచి రోజుకు 70 నుంచి 80మంది వరకు రోగులు సేవల కోసం వస్తున్నట్లు ఆసుపత్రుల ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు.

వీటిలో రోగులకు ఉచితంగా స్కానింగ్, ఎక్స్‌రే, సిటీస్కాన్, అల్ట్రాసౌండ్ వంటి పరీక్షలు చేస్తున్నట్లు చెప్పారు. జాతీయ ఆరోగ్య మిషన్‌లో భాగంగా నగరంలో ఏప్రిల్ చివరి వారంలోగా నగరంలో మొత్తం 16 ల్యాబ్‌లను ఏర్పాటు చేయాలని భావించి, ముందుగా యుసీహెచ్‌సీ శ్రీరాం నగర్, పానీపుర, బర్కాస్, జంగమెంట్, అంబర్‌పేట, సీతాఫల్‌మండీ,లాలాపేట్, పురానపూల్ లో మినీ హబ్‌లు ఏర్పాటు పేదలకు సకాలంలో రిపోర్టులు అందజేస్తున్నారు. వీటిని పరిధిలో 32 యుపిహెచ్‌సీ కేంద్రాలకు సబ్ సెంటర్ల నుంచి రోజుకు 310 మంది రక్తనమూనా శాంపిల్స్ సేకరిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. వీటిలో 56 రకాల పరీక్షలు చేస్తున్నట్లు, త్వరలో ఖరీదైన సేవలకు సంబంధించిన పరీక్షలు చేస్తామంటున్నారు. మినీ హబ్‌లను బస్తీ దవాఖానలకు అనుసంధానం చేసి, ఆయా ఆసుపత్రుల్లో వైద్యులు సిపార్సు చేస్తే రోగులకు ఉ చితంగా పరీక్షలు నిర్వహించనున్నట్లు వైద్యాధికారులు పేర్కొంటున్నారు. పరీక్షలు చేయించుకునేవారికి ఆన్‌లైన్‌లో రిపోర్టులు పంపుతారు.

ముందుగా స్కానింగ్‌లను ప్రారంభించి, తరువాత ఎంఆర్‌ఐ,సిటీస్కానింగ్ చేస్తారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లోని ల్యాబ్ టెక్నిషియన్లు, -వైద్యులు డయాగ్నస్టిక్ సెంటర్లులో విధులు నిర్వహించనున్నారు. ఇందుకోసం ఓ సాప్ట్‌వేర్ రూపొందించినట్లు, ఆసుపత్రికి వచ్చిన ప్రతి రోగికి పరీక్షలు అవసరమైతే డాక్టర్ సంతకంతో కూడిన స్లిప్‌ను రోగికి ఇవ్వాలి. ఆస్లిప్ ఉన్న వారికే పరీక్షలు చేస్తారు. రోగులకు సంబంధించిన పేరు,ఆధార్ నెంబర్, సెల్‌నెంబర్, వయస్సు వివరాలు ల్యాబ్ సెంటర్లు సిబ్బంది ఆప్‌లోడ్ చేసి,యూజర్ నేమ్, పాస్‌వర్డ్ ఇస్తారు. తరువాత పరీక్షలు చేసి, రిపోర్టులను వెబ్‌సైట్‌లో నమోదు చేసి, రోగికి సెల్‌పోన్‌ద్వారా సమాచారం పంపిస్తామని జిల్లా వైద్యాధికారులు వెల్లడించారు. డయాగ్నస్టిక్ మినీ హబ్‌లు అందుబాటులోకి తమ ఆరోగ్యానికి భరోసా లభిస్తుందని నగర వాసులు పేర్కొంటున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News