Monday, December 23, 2024

సిఎం, మంత్రుల చిత్రపటాలకు క్షీరాభిషేకం

- Advertisement -
- Advertisement -

వేల్పూర్ : మండల కేంద్రంలోని టిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో టిఆర్‌ఎస్ పార్టీ నాయకులు సిఎం కెసిఆర్, మంత్రులు హరీష్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డిల చిత్రపటాలకు గురువారం క్షీరాభిషేకం చేశారు. గురువారం మండల పార్టీ కార్యాలయంలో డిసిసిబి డైరెక్టర్ శేఖర్‌రెడ్డి, ఆర్డీఏ సభ్యుడు రేగుల రాములు మాట్లాడుతూ మారుమూల ప్రాంతమైన బాల్కొండ నియోజకవర్గ ప్రాంతంలో కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వారికి డయాలసిస్ కేంద్రం ఏర్పాటుచేయాలనే ఆలోచనతో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి మంగళవారం జగిత్యాల పర్యటనలో ఉన్న రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావును మార్గమధ్యలో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి వేల్పర్ క్యాంపు కార్యాలయానికి ఆహ్వానించి భీంగల్ ఆసుపత్రికి డయాలసిస్ సెంటర్ కావాలని కోరగా వెంటనే మంత్రి హరీష్‌రావు స్పందించి బుధవారం రోజు భీమ్‌గల్‌కు డయాలసిస్ సెంటర్‌ను మంజూరు చేయడం జరిగిందని తెలిపారు.

ఈసందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డికి వారు కృతఙ్ఞతలు తెలిపారను. భీమ్‌గల్‌లో కిడ్నీ బాధితులు డయాలసిస్ కోసం నిరుపేదలు ఎంతో వ్యయ ప్రయాసలు పడేవారని, ప్రభుత్వం స్థానికంగానే కిడ్నీ బాధితుల కోసం కోట్లాది నిధులతో డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకు రావడం ఎంతో హర్షణీయమన్నారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి డైరెక్టర్ శేఖర్‌రెడ్డి, భీమ్‌గల్ టిఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు దొనకంటి నర్సయ్య, జడ్పీ కోప్షన్ సభ్యు లు ఎకం.ఎ. మోయిజ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News