Wednesday, January 22, 2025

కొత్తగూడెం జిల్లాలో మూడు డయాలసిస్ కేంద్రాలు ఏర్పాట్లు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ ః కిడ్నీ రోగుల సౌకర్యార్థం కొత్తగూడెం జిల్లాలో మరో మూడు డయాలసిస్ సెంటర్లను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మణుగూర్‌లోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి, ఇల్లందులోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో బుధవారం ప్రారంభించనున్నారు. ఆశ్వరావు పేటలో మూడో డయాలసిస్ సెంటర్ ఈనెలాఖరులోగా రోగులకు అందుబాటులోకి తేనున్నారు.

ప్రస్తుతం కొత్తగూడెం ప్రభుత్వ జనరల్ హాస్పటిల్‌లో ఐదు మెషీన్లు, భద్రచలం గవర్నమెంటు ఏరియా ఆసుపత్రిలో 10 యంత్రాలతో డయాలసిస్ సేవలు అందిస్తున్నారు. ఈసెంటర్లకు రోజు రోజుకు కిడ్నీ రోగుల తాకిడి పెరగడంతో కొత్త వాటిని ఏర్పాట్లు చేస్తున్నట్లు వైద్యశాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు. కొత్త వాటితో రోగులకు త్వరగా డయాలసిస్ సేవలు అందించే అవకాశం ఉందని వైద్యులు పేర్కొంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News