Sunday, January 19, 2025

జెనీవా వేలంలో కోడిగుడ్డు సైజు వజ్రానికి రికార్డు ధర

- Advertisement -
- Advertisement -

Diamond fetches over $20 million at auction

జెనీవా: కోడి గుడ్డు పరిమాణంలో ప్రపంచంలోనే అత్యంత పెద్ద సైజు తెలుపు రంగు వజ్రం ది రాక్ బుధవారం క్రిస్టీస్ జువెలరీలో జరిగిన వేలం పాటలో 21.6 మిలియన్ స్విస్ ఫ్రాంకులకు(21.75 మిలియన్ అమెరికన్ డాలర్లు) అమ్ముడుపోయింది. కోడిగుడ్డు ఆకారంలో ప్లాటినం పెండెంట్‌తో ఉన్న ఈ 228 క్యారెట్ల వజ్రం మొత్తం బరువు 61.3 గ్రాములు ఉంది. 5.4 సెంటీమీటర్ల వెడల్పు, 3.1 సెంటీమీటర్ల ఎత్తు ఉన్న ఈ వజ్రం ఒక మీడియం సైజు కోడి గుడ్డు అంత ఉంది. ఒక గుర్తు తెలియని ప్రైవేట్ కొనుగోలుదారుడు ఈ వజ్రాన్ని వేలంలో దక్కించుకున్నట్లు తెలిసింది. ఈ వజ్రం ముందస్తు అంచనా 19 మిలియన్ నుంచి 30 మిలియన్ ఫ్రాంకులు ఉండగా అంచనాకు కొద్దిగా ఎక్కువగా ఇది అమ్ముడుపోయింది. కాగా, బుధవారం జరిగిన వేలంలో రెడ్ క్రాస్ డైమండ్ అనే 205.1 క్యారెట్ల పసుపు రంగు వజ్రం అంచనా ధర కన్నా రెండు రెట్లు అధికంగా 14.2 మిలియన్ ఫ్రాంకులకు అమ్ముడుపోయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News