- Advertisement -
పాట్నా: ఒక సంపన్న వజ్రాల వ్యాపారికి చెందిన తొమ్మిదేళ్ల కుమార్తె సర్వసౌఖ్యాలను త్యజించి జైన సన్యాసినిగా మారిపోయింది. గుజరాత్‌లోని సూరత్‌లో బుధవారం ఈ ఉదంతం చోటుచేసుకుంది. వజ్రాల వ్యాపారి ధనేష్, అమి సంఘ్వి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. వీరిలో పెద్ద కుమార్తె దేవాంశి బుధవారం వందలాది మంది బంధుమిత్రుల సమక్షంలో జైన సన్యాసి ఆచార్య విజయ్ కీర్తీయష్‌సూరి సమక్షంలో జైనసన్యాసినిగా దీక్ష తీసుకుంది. ఆ బాలిక తండ్రి సంఘ్వి అండ్ సన్స్ అనే సంస్థకు యజమాని. సూరత్‌లో మూడు దశాబ్దాలకు పైగా ఆయన వజ్రాల పాలిషింగ్, ఎగుమతి వ్యాపారంలో ఉన్నారు.
- Advertisement -