Thursday, November 21, 2024

అయోధ్య రాముడికి 101 కిలోల బంగారం

- Advertisement -
- Advertisement -

అయోధ్య: అయోధ్య.రామాలయ నిర్మాణానికి భూరి విరాళాలు అందచేసిన దాతల జాబితాలో గుజరాత్‌కు చెందిన ప్రముఖ వజ్రాల వ్యాపారి దిలీప్ కుమార్ వి లఖి, ఆయన కుటుంబం ప్రముఖంగా చాలిచారు. లఖి కుటుంబం గుజరాత్‌లోని సూరత్‌లో అతి పెద్ద వజ్రాల ఫ్యాక్టరీలు నిర్వహిస్తోంది. నగదు రూపంలో కాకుండా బంగారం రూపంలో ఆయన అపురూపమైన బహుమానాన్ని శ్రీరాముడికి అందచేశారు. దదాదాపు రూ. 68 కోట్లు విలువచేసే 101 కిలోల బంగారాన్ని ఆయన తీర్థ క్షేత్ర ట్రస్టుకు అందచేశారు. ఈ బంగారంతోనే ఆలయ ప్రధాన ద్వారాలు, గర్భాలయం, త్రిశూలం, డమరుకం, రామ మందిరం స్తంభాలకు బంగారం పైపూత పూశారు. ఇలా ఉండగా..రామాలయ నిర్మాణానికి అత్యధిక నగదు విరాళాలు అందచేసిన దాతగా ప్రముఖ ఆధ్మాత్మిక గురువు మురారి బాపు నిలిచారు. ఆయన తన శిష్యులతో కలసి అత్యధిక విరాళాన్ని అందచేశారు.

శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు కు చెందిన వెబ్‌సైట్‌లో పొందుపరిచిన వివరాల ప్రకారం& అయోధ్యలో రామాలయ నిర్మాణం కోసం మురారి బాపు రూ. 11.3 కోట్ల విరాళాన్ని అందచేశారు. అమెరికా, కెనడా, బ్రిటన్‌లో ఉన్న ఆయన శిష్యులు మరో రూ. 8 కోట్లను వ్యక్తిగతంగా సేకరించారు. ఇప్పటివరకు తీర్థ క్షేత్ర ట్రస్టుకు మొత్తం రూ. 5,500 కోట్ల మేరకు విరాళాలు అందాయి. అయితే నగదు రూపంలో అత్యధిక విరాళాన్ని అందచేసిన దాతల జాబితాలో మురారి బాపు అగ్రస్థానంలో ఉన్నారు. ఆయన వ్యక్తిగతంగా రూ.11.3 కోట్ల విరాళాన్ని అందచేశారు. విదేశాలలోని ఆయన శిష్యులు మరో రూ. 8 కోట్లు విరాళంగా పంపారు. ఈ విరాళాన్ని ఫిబ్రవరిలో నిర్వహించే రామ కథ సందర్భంగా ట్రస్టుకు అందచేయనున్నట్లు మురారి బాపు ప్రకటించారు. వీరి మొత్తం విరాళం విలువ రూ.18.6 కోట్లుగా నిలుస్తుంది. కాగా..సూరత్‌కు చెందిన మరో వజ్రం వ్యాపారి, శ్రీ రామకృష్ణ ఎక్స్‌పోర్ట్ అధిపతి గోవింద్‌భాయ్ ధోలాకియా అయోధ్య ఆలయానికి రూ. 11 కోట్లు విరాళంగా అందచేశారు.

అయోధ్య ఆలయాన్ని చారిత్రక ప్రాధాన్యమున్న ప్రదేశంగా, ప్రజల ప్రార్థనా మందిరంగా కేంద్ర ప్రభుత్వం గుర్తించడంతో ఈ ఆలయానికి అందచేసే విరాళాలకు ఆదాయం పన్ను చట్టంలోని 80జి(2) సెక్షన్ కింద పన్ను మినహాయింపు లభిస్తుందని ట్రస్టు వెబ్‌సైట్ పేర్కొంటోంది. అయితే రూ. 2,000కు మించిన నగదు విరాళాలకు పన్ను మినహాయింపు వర్తించదు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News