Monday, November 25, 2024

నూడుల్స్‌లో వజ్రాలు..లోదుస్తులలో బంగారం!

- Advertisement -
- Advertisement -

నూడుల్స్ ప్యాకెట్లలో దాచిన వజ్రాలు, ప్రయాణికుల శరీర భాగాలు, బ్యాగేజ్‌లో దాచిన బంగారాన్ని ముంబై విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి మొత్తం విలువ రూ. 6.46 కోట్లు ఉంటుందని ఒక అధికారి తెలిపారు. రూ. 4.44 కోట్ల విలువైన 6.8 కిలోల బంగారాన్ని, రూ. 2.02 కోట్ల విలువైన వజ్రాలను స్వాధీనం చేసుకున్న కస్టమ్స్ అధికారులు నలుగరు ప్రయాణికులను అరెస్టు చేసినట్లు సోమవారం రాత్రి ఒక ప్రకటనలో కస్టమ్స్ అధికారి ఒకరు పేర్కొన్నారు. ముంబై నుంచి బ్యాంకాక్ వెళుతున్న ఒక భారతీయ ప్రయాణికుడిని తనిఖీ చేసిన అధికారులకు అతని ట్రాలీ బ్యాగులోని నూడుల్స్ ప్యాకెట్లలో దాచిన వజ్రాలు లభించాయి. ఆ తర్వాత ఆ ప్రయాణికుడిని అరెస్టు చేశారు.

కాగా..కొలంబో నుంచి ముంబైకు ప్రయాణిస్తున్న ఒక విదేశఋ మహిళను తనిఖీ చేయగా ఆమె లోదుస్తులలో దాచిన 321 గ్రాముల బంగారం కడ్డీలు, ఒక చిన్న ముక్క బంగారం లభించాయి. వీరు గాక దుబాయ్, అబు దాబికి ప్రయాణిస్తున్న ఇద్దరేసి భారతీయ ప్రయాణికులు, బహ్రెన్, దోహా, రియాధ్, మస్కట్, బ్యాంకాక్, సింగపూర్ ప్రయాణిస్తున్న ఒక్కో భారతీయ ప్రయాణికుడి నుంచి మొత్తం రూ. 4.04 కోట్ల విలువ చేసే 6.199 కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కొందరు తమ మలద్వారంలో బంగారాన్ని దాచగా కొందరు బాగేజ్‌లో దాచినట్లు ఆ ప్రకటన తెలిపింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News