- Advertisement -
హైదరాబాద్: కాళేశ్వరం వల్ల రాష్ట్రంలో వ్యవసాయ విస్తరణ పెరిగిందని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కెటిఆర్ తెలిపారు. లంకె బిందెలు ఉన్నాయనుకుని హామీలు ఇచ్చామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారని ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్ లో కెటిఆర్ మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డి మాట్లాడే ముందు ఉపముఖ్య మంత్రి భట్టి విక్రమార్క ఇచ్చిన నివేదిక చదవాలని సూచించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గత 15 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి నేటి వరకు కాంగ్రెస్ నాయకులు ఒకే మాట చెబుతున్నారని మండిపడ్డారు. తాము దిగిపోయేటప్పటికి ఐటి ఎగుమతులు రూ. 241 లక్షల కోట్లు ఉంటాయని కెటిఆర్ పేర్కొన్నారు.
- Advertisement -