Monday, December 23, 2024

మోడీపై బిబిసి డాక్యుమెంటరీ నిషేధంపై ఆర్‌టిఐ జవాబులో ఏముందంటే…

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: గుజరాత్ అల్లర్లపై బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్(బిబిసి) నిర్మించిన డాక్యుమెంటరీ “ది మోడీ క్వెశ్చన్‌”ను భారత ప్రభుత్వం నిషేధించడానికి గల కారణాలు ఏమిటో చెప్పాలంటూ సమాచార హక్కు చట్టం(ఆర్‌టిఐ) కింద తృణమూల్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి సాకేత్ గోఖలే చేసుకున్న దరఖాస్తుకు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ జవాబిచ్చింది.

2021 ఐటి నిబంధనలకు చెందిన 116వ నిబంధనను ఉటంకిస్తూ ఇంటర్ డిపార్ట్‌మెంటల్ కమిటీ(సిడిసి) సిఫార్సుల మేరకు బిబిసి డాక్యుమెంటరీపై నిషేధం విధించినట్లు మంత్రిత్వశాఖ సమాధానమిచ్చింది. అయితే మంత్రిత్వశాఖ ఇచ్చిన సమాధానంపై టిఎంసి ప్రతినిధి సాకేత్ గోఖలే సవాలు చేశారు. సమాధానంలో పారదర్శకత పాటించాలని కోరుతూ అప్పీలు దాఖలు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు.

బిబిసి డాక్యుమెంటరీపై నిషేధం విధించడానికి గల కారణాలు, అందుకు సంబంధించిన ఫైళ్లు, ఉత్తర ప్రత్యుత్తరాలు, మెమోలు తదితర పత్రాలను తనకు అందచేయాలని కోరుతూ ఆర్‌టిఐ చట్టం కింద సాకేత్ గోఖలే దరఖాస్తు చేసుకున్నారు. ఐటి నిబంధనల్లోని 16వ నిబంధన అత్యవసర కేసులలోనే డిజిటల్ కంటెంట్‌ను అడ్డుకోవాలని మంత్రిత్వఖాఖకు అనుమతి ఇచ్చిందని సాకేత్ తెలిపారు. ఆ తర్వాత నిషేధాన్ని సమీక్షించడానికి మంత్త్ర శాఖ ఒక ఇంటర్ డిపార్ట్‌మెంటల్ కమిటీని ఏర్పాటు చేయాల్సి ఉంటుందని ఆయన వివరించారు.

ఐటి చట్టంలోని 17వ నిబంధన ప్రకారం ఐడిసి ప్రొసీడింగ్స్‌కు సంబంధించిన పూర్తి రికార్డులను, ఫిర్యాదులను, సిఫార్సులను మంత్రిత్వశాఖ భద్రపరచాలని, ఐడిసికి సంబంధించిన రికార్డులన్నీ ఆర్‌టిఐ చట్టం ప్రకారం పారదర్శకమని, అవి బహిర్గత పరచాల్సి ఉంటుందని సాకేత్ తెలిపారు. అయితే ప్రధాని నరేంద్ర మోడీపై బిబిసి రూపొందించిన డాక్యుమెంటరీని నిషేధించడం వెనుక ఉన్న కారణాలను మాత్రం మంత్రిత్వశాఖ వెల్లడించలేదని ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News