Sunday, December 22, 2024

డబ్బు కోసం, పనుల కోసం రాజకీయాల్లోకి రాలేదు

- Advertisement -
- Advertisement -

బిఆర్‌ఎస్ ఎంపి గడ్డం రంజిత్ రెడ్డి

మనతెలంగాణ/హైదరాబాద్:  డబ్బు కోసం, పనుల కోసం తాను రాజకీయాల్లోకి రాలేదని, తనకు రాజకీయంగా జన్మనిచ్చిన చేవెళ్ల ప్రాంత పేదలకు సేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చానని బిఆర్‌ఎస్ ఎంపి గడ్డం రంజిత్ రెడ్డి స్పష్టం చేశారు. బిజెపి నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అర్ధరహిత అన్నారు. ఆయన దిగజారుడు తనానికి నిదర్శనమన్నారు. గురువారం రంజిత్‌రెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు. మహేశ్వర్ రెడ్డి చేసిన ఆరోపణలు నిరూపిస్తే తాను దేనికైనా సిద్ధమని ఆయన సవాల్ చేశారు.

చేవెళ్లకు వచ్చిన మహేశ్వర్ రెడ్డి ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదివారని ఆయన మండిపడ్డారు. ఏదైనా అంశంపై మాట్లాడే ముందు వాస్తవాలు తెలుసుకోవాలని ఆయన హితవు పలికారు. సీతారాంపూర్ భూముల వ్యవహారంలో తన పాత్ర లేదన్నారు. తాను అసైన్డ్ భూములు తీసుకున్నట్టు రుజువు చేయగలవా? అని మహేశ్వర్ రెడ్డిని ప్రశ్నించారు. కెటిఆర్ బినామీ అంటూ ఆరోపణలు చేయడం సహేతుకం కాదన్నారు. తప్పుడు ఆరోపణలు మానుకోవాలని రంజిత్‌రెడ్డి హితవు పలికారు. తనకు అసైన్డ్ భూమి ఒక్క ఇంచు ఉందని నిరూపించినా దేనికైనా సిద్ధమేనన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News